counter

Search google

GAS GON

"అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ.. వెంట‌నే త‌గ్గాలంటే..? Nt News అతిగా భోజ‌నం చేయ‌డం, స‌మ‌య పాల‌న లేకుండా ఆహారం తిన‌డం, జంక్ ఫుడ్‌, కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తిన‌డం వంటి ప‌నుల వ‌ల్ల చాలా మందికి అజీర్తి స‌మ‌స్య త‌లెత్తుంది. దాని వెంటే గ్యాస్‌, అసిడిటీలు కూడా వస్తాయి. అయితే వీటిని త‌గ్గించుకోవాలంటే ఇంగ్లిష్ మందులు అవ‌స‌రం లేదు. ఆయా స‌మ‌స్య‌ల‌కు ఇంట్లోనే చక్క‌ని ప‌రిష్కారం ఉంది. ఇంట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం స‌మ‌స్య‌ల‌ను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం అసిడిటీ సమస్య బాధిస్తుంటే చిన్న బెల్లం ముక్కను భోజనం చేసిన ప్రతిసారీ నోట్లో వేసుకుని చప్పరిస్తే సరిపోతుంది. దీంతో తిన్న ఆహారం కూడా సరిగ్గా, త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య తొలగిపోతుంది. నీరు నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. జీర్ణాశయంలో అధికంగా ఉత్పన్నమయ్యే గ్యాస్ కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు జీర్ణం కాకుండా ఉన్న పదార్థాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి. లవంగాలు భోజనం చేసిన తరువాత గ్యాస్ అధికంగా వస్తుంటే అందుకు లవంగాలు ఉత్తమమైన పరిష్కారం చూపుతాయి. 2, 3 లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు గ్యాస్ సమస్య ఇట్టే తొలగిపోతుంది. అసిడిటీ నుంచి కూడా బయట పడవచ్చు. తులసి ఆకులు జీర్ణాశయంలో వచ్చే సమస్యలను తొలగించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటిని బాగా నలిపి, దానికి కొంత తేనెను జతచేసి ఉదయాన్నే పరగడుపున తాగితే అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి. సోంపు అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సోంపు బాగా ఉపయోగపడుతుంది. 1 టీస్పూన్ సోంపును భోజనం చేసిన ప్రతిసారీ వేసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ కూడా తగ్గుతుంది. ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుంది. పెరుగు కొద్దిగా పెరుగును తీసుకుని అందులో కీరదోస ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన తరువాత సేవిస్తే అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. గ్యాస్, అసిడిటీ కూడా తగ్గుతాయి. కడుపులో ఏర్పడే మంటను ఇది తొలగిస్తుంది. మూలాన్ని చ‌ద‌వండి 163అయిష్ట‌త‌" - అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ.. వెంట‌నే త‌గ్గాలంటే..? http://tz.ucweb.com/8_27E90

MOBIL TIFT?

సోమాజిగూడ/హైదరాబాద్: క్రాంతి ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి పంజాగుట్టలో గది అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు. డోర్‌ పక్కన మొబైల్‌ ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి స్నానానికి వెళ్లాడు. ఆఫీసుకు వెళ్లేందుకు బ్యాగ్‌, టిఫిన్‌ బాక్స్‌ సిద్ధం చేసుకున్నాడు. ఫోన్‌ తీసుకుందామని డోర్‌ వద్దకు వెళ్లి చూడగా లేదు. రూమ్‌లో ఉన్న మరో స్నేహితుడిని.. నా ఫోన్‌ ఎక్కడుందని అడగగా తెలయదని సమాధానం చెప్పాడు. ఓ క్షణం ఆలోచించాడు... తన వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి ఇంటర్నెట్‌ సహాయంతో మొబైల్‌ తన పక్కనే ఉన్న రూమ్‌లో ఉందని గుర్తించాడు. ఇవ్వమని వారిని బతిమాలాడు. నీ ఫోన్‌ మేమెందుకు తీసుకుంటామని వాగ్వివాదానికి దిగారు. క్రాంతి పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌కెళ్లి విషయాన్ని పోలీసులకు వివరించాడు. కానిస్టేబుల్స్‌ వెళ్లి ఆ గదిని పరిశీలించగా.. మొబైల్‌ ఆచూకీ లభించింది.
సోమాజిగూడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సింధు స్మార్ట్‌ఫోన్‌ను ఆమె మూడేళ్ల కుమార్తె తీసుకుంది. ఇంట్లో తిరుగుతూ ఫోన్‌తో ఆడుకుంటుంది. గమనించిన ఆమె ఎక్కడికి వెళ్తుందిలే అనుకుంది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి చేతిలో నుంచి ఫోన్‌ మాయమైంది. సింధు అర్జెంటుగా ఆఫీసుకు వెళ్లాల్సి ఉంది. ఇంటి నుంచి వెళ్లాలంటే రెండు బస్సులు మారాలి. ఫోన్‌ లేకపోతే కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో ఎంత వెతికినా కనిపించలేదు. కూతురిని అడిగితే చెప్పలేకపోతోంది. గంట సమయం దాటిపోయింది. ఫోన్‌ దొరకడం లేదు. మరో మొబైల్‌ నుంచి ఫోన్‌ చేస్తే రింగ్‌ అవుతున్నా.. ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఫ్రెండ్‌ సహాయంతో ఇంటర్నెట్‌ ఓపెన్‌ చేసి తన జీమెయిల్‌ ఐడీ ద్వారా మొబైల్‌ ఎక్కడుందో క్షణాల్లో తెలుసుకుంది.
ఎక్కడో ఫోన్‌ పెట్టి మరిచిపోతాం.. పని చేసుకుంటూ ఎక్కడ పెట్టామో తెలియక వెతుకుతుంటాం. పిల్లలు పోన్‌ తీసుకుని గేమ్‌ ఆడుకుని అయిపోయాక ఎక్కడో పెట్టి మరిచిపోతారు. ఫోన్‌ ఎక్కడుందని అడిగితే సమాధానం రాదు. దానికోసం వెతుకుతూ కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగుతాం. ఆలోచిస్తే వెతికి పట్టుకోవచ్చు. ఇంటర్నెట్‌ సహాయంతో మొబైల్‌ ఉన్న ప్రాంతాన్ని తెలుసుకోవచ్చు. ఈమెయిల్‌ ఐడీతో కనిపించని మొబైల్‌ ఫోన్‌ను గుర్తించొచ్చు. ఎవరైనా దొంగలిస్తే లొకేషన్‌ కూడా పట్టేస్తుంది.
ఇలా గుర్తించవచ్చు
ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు జీమెయిల్‌ ఐడీ తప్పనిసరిగా అనుసంధానం చేసి ఉండాలి. కంప్యూటర్‌ లేదా మొబైల్‌లో జీమెయిల్‌ ఐడీని ఓపెన్‌ చేయాలి. మెయిల్‌ ఐడీ పేజీలో కుడివైపు మై అకౌంట్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. వెంటనే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో ఫైండ్‌ యువర్‌ ఫోన్‌ అని ఉంటుంది. అక్కడ క్లిక్‌ చేయగానే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ మన జీ మేయిల్‌ ఐడీ ఏ ఏ మొబైల్స్‌కి అనుసంధానం చేశామే చూపిస్తుంది. అక్కడ మనం ఉపయోగిస్తున్న మొబైల్‌ను సెలెక్ట్‌ చేయాలి. అకౌంట్‌ వెరిఫై చేయాలని పాస్‌వర్డ్‌ అడుగుతుంది. ఐడీ పాస్‌వర్డ్‌ టైప్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. రింగ్‌, లొకేట్‌ యువర్‌ ఫోన్‌ అని ప్రత్యక్షం అవుతుంది. కుడివైపు రెండు సింబల్స్‌ కనిపిస్తాయి. ఒకటి రింగ్‌, రెండోది మ్యాప్‌ లొకేషన్‌. ఇంట్లోనే ఉంటే రింగ్‌ అప్షన్‌ ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉన్న రింగ్‌టోన్‌ సౌండ్‌ వినిపిస్తుంది. ఎడమ భాగంలో మరిన్ని ఆప్షన్స్‌ ఉన్నాయి. మొబైల్‌ లొకేషన్‌, డివైజ్‌ లాక్‌, కన్సిడర్‌ ఎరైజ్‌ డాటా... అని ఉన్నాయి. మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి.
వ్యక్తిగత డేటా తొలగించొచ్చు
మహానగరంలో ఎక్కువమంది ఉపయోగించేది ఖరీదైన ఫోన్లే. రోజుకు సుమారు వందకు పైగా వారివారి ఫోన్‌లను పోగొట్టుకుంటున్నట్లు సమాచారం. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మరి కొంతమంది పోనీలే అని లైట్‌గా తీసుకుంటున్నారు. యువతులు వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉంటే దొరికిన వ్యక్తి సామాజిక మద్యమాల్లో పోస్ట్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యమైన ఫొటోలు, ఫోన్‌ నెంబర్‌లు ఉంటాయని ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని మనోవేదన చెందుతారు. వీటికి పరిష్కారం ఉందని చాలా మందికి తెలియదనే చెప్పాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని స్మార్ట్‌ ఫోన్‌ను లాక్‌ చేయడంతో పాటు కీలక సమాచారాన్ని తొలగించే అవకాశం ఉంది.
లొకేషన్‌ తెలుసుకోవచ్చు
స్మార్ట్‌ ఫోన్‌కు అనుసంధానం చేసిన జీ మెయిల్‌ ఐడీ సహాయంతో మీ ఫోన్‌ లొకేషన్‌ ఎక్కడుందో తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంది. జీ మెయిల్‌ ఐడీ ఓపెన్‌ చేసిన తర్వాత మై అకౌంట్‌ అనే ఆప్షన్‌ ద్వారా మొబైల్‌ లోకేషన్‌ను తెలుసుకోవచ్చు. దీని కోసం పోలీస్‌స్టేషన్‌, ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు.
జాగ్రత్తగా వ్యవహరించాలి
ఏ పని చేయాలన్నా అందరూ స్మార్ట్‌ ఫోన్‌ మీద ఆధారపడుతున్నారు. సమాచారాన్నంతటినీ ఫోన్‌లోనే భద్రపరుస్తున్నారు. భద్రతపరంగా భాగానే ఉంటుంది. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. జీమెయిల్‌కి ఫోన్

Chennai

https://www.asklaila.com/search/Chennai/pudupet/two-wheeler-spare-parts/

Niti

అష్ట సిద్ధులు అని వేటిని అంటారు?
అణిమ: అన్ని జంతువుల కంటే స్వల్ప జంతువు వలే కనపడుట . తన ఆకారం కంటే కొద్ది ఆకారం గల జీవము వలే యుండుట .
మహిమ:బ్రహ్మ , విష్ణు, శివుడు ఈ త్రిమూర్తులు కంటే పెద్దవాడిగా కనపడుట.
లఘిమ:దూది కంటే తేలిక అయ్యి ఉండుట. యే మాత్రం బరువు లేకుండా ఉండుట .
గరిమ : బరువుగల సమస్త జీవములు, సమస్త పదార్దముల కంటే బరువు అయ్యి ఉండుట.
ప్రాప్తి : కోరిన దానినేల్లా కలగ చేసుకొనుట . తనకే ఆకారం కావలెను అన్న ఆ ఆకారంని పొందుట. కొరిన చోటుకెల్లా క్షణ మాత్రములో పోవుట , కొరిన వస్తువుని గాని జీవముని గాని తన వద్దకి తెప్పించు కొనుట .
ప్రాకామ్యము : ఆకాశ గమనము కలిగి యుండుట, తన శరీరం వదిలి త్రిలోక సుందరమగు యవ్వన శరీరము తాను కోరినంత కాలము పొంది యుండుట.
వశిత్వము:సమస్త జంతువులను , దుష్ట మృగములను పెద్ద పులి,చిరుత పులి , సింహము, మదగజము మొదలగు అడివి జంతువులను మొసలి, తాంబేలు, చేప మొదలగు నీటి జంతువులను, సర్పములు మొదలగు వాటిని మచ్చిక చేసుకొనుట .
ఈశత్వము : కామ, క్రోధ, లోభ, మోహ , మధ, మాత్సర్యము అనెడు అరిషడ్వర్గములను జయించి ఆధ్యాత్మిక , బౌతికాది , ధైవికములు అనెడి తాపత్రయములు లేనివాడై జితేన్ద్రియుడై , భూత, భవిష్యత్ , వర్తమాన విషయాలను సర్వమును గ్రహించి ఈశ్వరుని వలే సృష్టి, స్థితి, లయములు లకు కారణ భూతుడు అగుట .
అష్ట సిద్ధులను పురాణ పురుషులు ప్రదర్శించారు.
అణిమా సిద్ధిని హనుమంతుడు సీతాన్వేషణ లో భాగంగా లంకలో ప్రవేశించేటపుడు చిన్న పరిమాణంలో మారి ప్రదర్శించాడు.
మహిమా సిద్ధిని హను మంతుడు సముద్రోల్లంఘన సమయంలో ప్రదర్శించాడు.
ఇక సురస నోరు తెరిచినపుడు పెద్దవాడుగా మారి ఒక్క సారిగా చిన్నవాడిగా మారి అణిమా మహిమా సిద్ధుల్ని ఒక దాని వెంట ఒకటి ప్రదర్శిం చాడు.
ఇంకా ఎన్నో చోట్ల ఆయన కాయాన్ని పెంచడం కనిపిస్తుంది.
ఇక వామనావతారంలో విష్ణువు మూడడు గులతో భూమ్యా కాశాలను ఆవరించిన పుడు కూడా ఇదే విధంగా పెరిగాడు.
గరిమా సిద్ధిని కృష్ణుడు చిన్నతనంలో తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో ఎత్తుకు పోవడానికి వచ్చినపుడు అతనితో బాటు పైకె గిరి వాడి భుజాల మీద కూర్చుని బరువుగా మరరడంతో వాడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వాడిని కృష్ణుడు చంపివేశాడు.
భీముడు సౌగంధిక పుష్పాలను తెచ్చేందుకు వెళ్లినపుడు హనుమంతుడుడు తన తోకను అడ్డుగా పెట్టి దానిని భీముడు ఎత్తలేనంత బరువుగా మార్చాడు.
లఘిమా అంటే తేలికగా అయిపోవడం. ఆకాశగమనం వంటివి కూడా దీనితో అనుబంధంగా వచ్చే శక్తులని చెబుతారు.
ఈ సిద్ధుల ప్రదర్శన మనకు రామాయణ, భాగవతాదుల్లో ప్రముఖంగా కనిపిస్తుంది.
ఒక్క సిద్ధి సరైన గురువు వద్ద పొండానికే 40 సంవత్సరాలు పడుతుందని చెబుతారు. దీనికి సంబందించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఆది శంకరులకు ఒక పర్యాయంఒక సిద్ధుడు తారసపడ్డాడు.తన కు ఉన్న ఆకాశ గమన విద్యను ఆయన ముందు ప్రర్శించాడు. అది సాధించేందుకు ఎంత కాలం పట్టిందని ఆయన అడిగారు. 40 ఏళ్లు పట్టిందని చెప్పాడు.
ఆ విద్య పొందేందుకు నీ జీవితంలో 40 ఏళ్లు ఖర్చు పెట్టావు. ఏ సత్పురుషుడిని దూషించినా కాకివై పుట్టి పుట్టుకతోనే ఆకాశగమనం సాధించేవాడివి కదా అని ఆయన ఎద్దేవా చేసినట్టు చెబుతారు. సిద్ధులు సాధించడం అనవసరమని, అందుకు జీవితం లో అంత కాలం వృధా చేయకుండా భగవన్నామ స్మరణ వల్ల ఉత్తమ గతులు పొందితే బాగుండుననేది ఆయన ఉద్దేశం.
(సేకరణ)

Niti

అధికార గర్వం వినాశకరం
నహుషుడు చంద్రవంశంలో జన్మించిన గొప్ప రాజు. దానధర్మాలతో, యజ్ఞయాగాలతో, యయాతి వంటి పుత్రులతో ప్రపంచమంతటా వేనోళ్ల కీర్తింపబడిన వాడు. అలా దశదిశలకూ వ్యాపించిన అతని కీర్తి, ఇంద్రలోకానికి కూడా చేరుకుంది. అక్కడ నుంచి అసలు కథ మొదలైంది. ఒకసారి ఇంద్రుడు వృత్రాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. దాని వల్ల తనకు పాపం చుట్టుకుందని భావించిన ఇంద్రుడు, కొన్నాళ్ల పాటు నారాయణమంత్రాన్ని జపిస్తూ ఒక కమలంలో ఉండిపోవాలని నిశ్చయించుకుంటాడు. కానీ ఇంద్రుడు వచ్చేవరకూ ఇంద్రపదవిని అధిష్టించేది ఎవరు అన్న సమస్య మొదలైంది. ఇంద్రపదవిని చేపట్టేందుకు అందుకు సాటైనవాడు ఎవరా అని అష్టదిక్పాలకులంతా ఆలోచించగా, నహుషుడే అందుకు తగినవాడు అని తట్టింది. దాంతో ఒక సాధారణ రాజైన నహుషుడికి ఇంద్రపదవిని కట్టబెట్టారు.
     ఇంద్రపదవిని చేపట్టిన నహుషుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు. కానీ రానురానూ అతనిలో అధికారం తలకెక్కింది. మదపు మత్తులో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలాంటి నహుషునికి ఓమారు ఇంద్రుని భార్య అయిన శచీదేవి కనిపించింది. అంతే! ‘ఇంద్రపదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా!’ అనుకున్నాడు నహుషుడు. వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియచేశాడు. నహుషుని మాటలకు శచీదేవి విస్తుబోయింది. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. వద్దు అన్నా ఆగేట్లు లేడు నహుషుడు. ఆ సమయంలో దేవతల గురువు బృహస్పతి, శచీదేవికి ఒక ఉపాయాన్ని అందించాడు. ‘ఏ మదంతో అయితే నహుషుడు మునిగితేలుతున్నాడో, ఆ మదంతోనే అతన్ని జయించాలి. అందుకోసం నువ్వు అతడిని ఒక కోరిక అడుగు’ అంటూ శచీదేవికి ఒక సలహా ఇచ్చాడు. బృహస్పతి ఇచ్చిన సలహా మేరకు శచీదేవి, నహుషునికి ఒక కబురు పంపింది ‘ఇంద్రపదవిలో ఉన్నావు కాబట్టి, అందుకు తగినట్లుగా గొప్ప రుషులందరి చేతా పల్లకీని మోయించుకుంటూ రా!’ అన్నదే ఆ సందేశం.‘ఓస్‌! అంతేకదా’ అనుకున్నాడు నహుషుడు. అగస్త్యుడు మొదలైన రుషులందరి చేతా తన పల్లకీని మోయించాడు. అసలే ఇంద్రపదవి, ఆపై తన సొంతం కానున్న శచీదేవి! నహుషుని సంబరానికి అంతులేకుండా పోయింది. శచీదేవిని చేరుకునేందుకు అతని మనసు ఉవ్విళ్లూరుతోంది. ఆ తొందరలో పల్లకీని మోస్తున్న అగస్త్యుడిని ఒక్క తాపు తన్నాడు. ‘సర్ప! సర్ప!’ (త్వరగా, త్వరగా) అంటూ ఆయనను తొందరపెట్టాడు. ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్వలేకపోయాడు. ‘సర్ప! సర్ప! అంటున్నావు కదా! నువ్వు సర్పానివై భూలోకాన పడి ఉండు,’ అంటూ నహుషుడిని శపించాడు.
        అగస్త్యుని శాపం విన్న తరువాత కానీ తానెంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థం కాలేదు నహుషునికి. కానీ జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది కదా! ఇక చేయగలిగిందేమీ లేదని గ్రహించిన నహుషుడు ‘తప్పైపోయింది మహాప్రభూ! నాకు ఈ శాపవిమోచనం కలిగే ఉపాయాన్ని అనుగ్రహించండి!’ అంటూ అగస్త్యుని ప్రాథేయపడ్డాడు. నహుషుని పశ్చాత్తాపాన్ని గమనించిన అగస్త్యుడు ‘కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక కొండచిలువ రూపంలోనే సంచరిస్తూ ఉండమనీ, ఆ తరువాత అటుగా వచ్చేవారు ఎవరైతే నహుషుని ప్రశ్నలకు సరైన జవాబులు అందిస్తారో, వారే అతనికి శాపవిమోచనాన్ని కలిగిస్తారనీ’ సెలవిస్తాడు. అగస్త్యుడు పేర్కొన్నట్లుగానే... చాలా ఏళ్ల పాటు ద్వైతవన సమీపంలో కొండచిలువ రూపంలో సంచరించసాగాడు. అలాంటి ఒక సందర్భంలో భీముడు అటు రావడం తటస్థించింది. సర్ప రూపంలోని నహుషుడు మాంచి కండపట్టి ఉన్న భీముని అమాంతం చుట్టిపారేశాడు. భీముని పరాక్రమం నహుషుని పట్టు ముందర ఎందుకూ కొరగాకుండా పోయింది. మరికాసేపటిలో నహుషుడు, భీముని ఫలహారం చేస్తాడనగా... తన సోదరుని వెతుక్కుంటూ ధర్మరాజు అక్కడకు చేరుకున్నాడు. నహుషుని చెరలో విలవిల్లాడుతున్న భీముని చూడగానే ధర్మరాజుకి ఆ సర్పం సామాన్యమైనది కాదని అర్థమైంది. దాంతో మెల్లగా దాన్ని మాటల్లోకి దింపి తన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు. ‘నీ ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలిగితే నా సోదరుడిని విడిచిపెడతావా!’ అని ప్రతిపాదించాడు ధర్మరాజు. ‘నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, శాపవిమోచనాన్ని కలిగిస్తానంటే అంతకంటేనా! జవాబులు చెప్పకుంటే మాత్రం నీ సోదరుని చావు తథత్యం!’ అన్నాడు సహుషుడు. సహుషుడు, ధర్మారాజుని రెండు ముఖ్యమైన ప్రశ్నలు వేశాడు. అవి ‘బ్రాహ్మణుడు అంటే ఎవరు? అతను ఏం తెలుసుకోవాలి?’ అని. దానికి ధర్మరాజు ‘సత్యం, దానం, దయ, వ్యక్తిత్వం, అహింస, నిగ్రహము... వంటి లక్షణాలు ఉన్నవాడే బ్రాహ్మణుడనీ, అతను దుఃఖానికి అతీతమైన పరబ్రహ్మను తెలుసుకోవాలనీ’ బదులిచ్చాడు. అంతేకాదు! ఈ గుణాలు కలిగినవారెవ్వరైనా సరే బ్రాహ్మణులని చెప్పుకొచ్చాడు.
     ధర్మరాజు జవాబులకు నహుషుని మనసుకి సబబుగా తోచడంతో అతనికి శాపవిమోచనం కలిగింది. ఇటు భీమునికీ స్వేచ్ఛ లభించింది. పౌరులను పాలించాల్సిన రాజుకి, ఆ పాలనాధికారమే తలకెక్కిన రోజు నహుషునిలా దిగజారిపోక తప్పదని ఈ కథ చెబుతోంది.

Santi

జనమేజయునికి శునకం చెప్పిన సద్బోధ!
యుద్ధభూమి అయిన కురుక్షేత్రంలో అభిమన్యుని మనుమడైన జనమేజయుడు శుభాన్ని కోరుతూ దీర్ఘసత్రయాగం చేశాడు. ఆ యాగం చూడడానికి దేశదేశాల నుండి జనం వచ్చారు. ఆ యాగ ప్రాంతం అంతా పవిత్రమైన మంత్రోచ్చారణలతో, ధూప దీపాలతో, పండితోత్తములతో, ఋషీశ్వరులతో శుభప్రదంగా కనిపిస్తోంది. ఆ యాగ ప్రదేశంలో అందరూ భక్తిస్రద్ధలతో దీర్ఘసత్రాన్ని చూస్తున్నారు.
అంతలో సారమేదుడు వచ్చాడు అక్కడికి. సరమ అనే దేవతాశునకం యొక్క కొడుకువాడు. ఆ సారమేయం, అంటే, ఆ కుక్క యాగ ప్రదేశమంతా  తిరిగి ఆడుకొంటుంది. భక్తి శ్రద్ధలతో యాగాన్ని చూస్తున్న వారంతా ఒక్కసారిగా భయభ్రంతులయ్యారు. “అయ్యో, కుక్క యాగభూమిలోకి వచ్చింది. ఏమి అశుభం కలుగుతుందో” అని అందరూ మనస్సులో చింతిస్తున్నారు. ఆ సారమేయాన్ని దూరం నుంచి చూశారు. భీమసేనుడు, శ్రుతసేనుడు, ఉగ్రసేనుడు, ఈ ముగ్గురూ జనమేజయుని సోదరులు. శ్రుతసేనుడు  ఇప్పుడే ఈ కుక్కని వెళ్లగొట్టాలి. అన్నాడు. ఊరికే వెళ్లదు దీని కాళ్లు విరిగేలా కొట్టాలి, అని ఆ సారమేయాన్ని చితకబాదారు ఉగ్రసానుడు, భీమసేనుడు. ఆ కుక్క పెద్దగా అరుస్తూ, ఏడుస్తూ ఆ ప్రదేశం నుంచి పారిపోయింది.
ఆ సారమేయం ఏడుస్తూ తల్లి సరమ దగ్గరకెళ్ళింది. “నన్ను వాళ్ళు బాగా కొట్టారు” అంది ఎడుస్తూ తల్లితో. “నువ్వేం చేసావు” అంది సారమేయం. నేనేం చేయతేదు, ఎవర్నీ కరవలేదు, ఎవరి పైనా మొరగలేదు, ఊరికే కొట్టారు. ఈ కాలుచూడు ఎలా వాచిపోయిందో, ఈ కన్ను నొప్పి పుడుతుందో....అబ్బ...
సారమేయం ఏడుస్తుంటే తల్లి సమరకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అంతలోనే కోపంతో ఊగిపోయింది సమర. సమర తిన్నగా జనమేజయుని వద్దకు వెళ్ళింది. యాగం చేస్తున్న జనమేజయుడు ఆశ్చర్యంగా ఆ శునకాన్ని చూసాడు. ‘రాజా, నువ్వు ధర్మాత్ముడవై శుభం కోరి యాగం చేస్తున్నావు. సరే నీ సోదరులు దయారహితులై నా కుమారుడు, అపరాధుడూ అయిన సారమేయుని కొట్టారు. ఆడుకుంటున్న నా బాలుడు మీకు ఏం అపకారం చేశాడు. ఇలా ధర్మ రహితులై,.. దయాహీనులై ఉంటే నీవేం చేయవా?’ అంది కోపంగా. ఆ సరమ కళ్ళు నిప్పుల్లా ఎర్రగా మెరిసాయి. అక్కడున్న జనమంతా భయపడిపోయారు. జనమేజయుడు ఏం తోచక అలాగే చూస్తూ ఉండిపోయాడు.
“రాజా విను, ఇది తగును, ఇది తగదు అని మనస్సులో అనుకోకుండా సాధువులకు కీడుచేస్తే అశుభాలు కలుగుతాయి. ఈ విషయం గుర్తుంచుకో” అంది. ఆ మాట చెప్పి సరమ అదృశ్యమైపోయింది. జనమేజయుడు చెప్పరాని ఆవేదన చెందాడు. యజ్ఞం పూర్తి అయింది. అయినా జనమేజయుని మనస్లులో సరమ అన్న మాటలే గుర్తొస్తున్నాయి. తన తమ్ములు చేసింది తప్పే. ఏ జంతువునైనా అనవసరంగా హింసింతకూడదు. హింసవల్ల ఉశుభాలు కలుగుతాయి అని గ్రహించాడు.
జీవహింస కూడదు అనే విషయాన్ని సరమ కథ ద్వారా మనం తెలుసుకోవాలి.

http://www.kanagembalu.com/

Labels